Rashmi Gautam: బెడ్ రూమ్ రొమాన్స్ కోసం రష్మీ అంత డిమాండ్ చేసిందా..?

Rashmi Gautam: టీవీ షోలు, ఇతర ప్రోగ్రాములతో బుల్లితెరపై బాగా ఫేమస్ అయ్యింది రష్మీ. జబర్దస్త్ వంటి షోల్లో యాంకరింగ్ రష్మీకి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇక కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ లోని అన్ని ప్రముఖ ప్రోగ్రామ్స్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. రష్మీ – సుధీర్ జోడికి టీవీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉండడం రష్మీకి కలిసొచ్చింది. తనదైన స్టైల్ యాంకరింగ్ తో, నటనతో తెలుగు నాట ప్రేక్షకులకు బాగా చేరువైంది రష్మీ గౌతమ్.

 

ఇక తనకు ఉన్న క్రేజ్ ను బాగానే వాడుకుంది రష్మీ. బుల్లితెరతో పాటు.. వెండితెరపై నటించడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదలలేదు. ఆ మాటకొస్తే రెచ్చిపోయి నటించి, అందాలు ఆరబోసి కుర్రకారును ఉర్రుతలూగించింది. “గుంటూరు టాకీస్” మూవీలో రష్మీ చేసిన రొమాన్స్ మాములుగా లేదు. అలా కొన్ని సినిమాల్లో మంచి పేరే తెచ్చుకున్నా.. హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు పొందలేకపోయింది.

 

అయితే ఇటీవల రష్మీ హీరోయిన్ గా నందు హీరోగా నటించిన ‘బ్లాక్ బస్టర్’ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సినిమా యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఇక మేకింగ్ విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీనితో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలిగించిందని ట్రైలర్ చూసిన వారు అంటున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటో మీరే చుడండి..

 

ఈ మూవీలో నందుతో రొమాన్స్ చేసినందుకు రష్మీ భారీగా రెమ్యునరేషన్ అందుకుందని.. హీరోకు ఎక్కువగా క్రేజ్ లేని కారణంగా.. అదే సమయంలో రొమాన్స్ సీన్స్ బాగా ఉండడం వల్ల రష్మీ అధిక మొత్తంలో డిమాండ్ చేసినట్టు టాక్. చిన్న హీరోలతో రొమాన్స్ లకు ఎవరైనా ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు. అయితే రష్మీ మాత్రం డబుల్ రెమ్యునరేషన్ అడిగిందట. ఏదేమైనా రష్మీ బెడ్ పై చేసిన ఈ రొమాన్స్ సీన్లు సినిమాకు ప్లస్ అవుతాయనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -