Nagarjuna: నాగార్జునపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే?

Nagarjuna: వారసత్వంగా సినిమాల్లోకో లేదంటే రాజకీయాల్లోకి రావడం సులభమే. కానీ అందులో నిలదొక్కుకోవడం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అయితే ఎంతోమంది ఈ సవాళ్లకు ఎదురొడ్డి ఉండలేక మధ్యలోనే వెనక్కి తిరిగి వెళుతుంటారు. కానీ మరికొందరు మాత్రం అలా కాకుండా ఎదురించి నిలబడి, విజేతలుగా నిలుస్తారు. ఇలాంటి సవాళ్లను ఎదురించిన వారిలో అక్కినేని నాగార్జున ఒకడు.

 

తన తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు సాయంతో సులభంగానే సినిమాల్లోకి వచ్చినా తనదైన స్టైల్, నటనతో నాగార్జున సినిమాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. అటు సినిమాలు, బిగ్ బాస్ లాంటి షో, యాడ్స్ చేస్తూ నాగ్ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాడు. అయితే తాజాగా అక్కినేని నాగార్జున మీద విమర్శల వర్షం కురుస్తోంది.

 

తమిళంలో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. అందులో ఓ ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్ విషయంలో కమల్ హాసన్ అండగా నిలిచాడు. ట్రాన్స్ జెండర్ అని అవహేళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు సదరు ట్రాన్స్ జెండర్ కు అండగా నిలిచాడు. అయితే తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. ఆయన మాత్రం ఇలా ఎన్నడూ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

 

బిగ్ బాస్ తెలుగులో నాగార్జున హౌజ్ లోని భామల అందాల గురించి భజన తప్పితే, ఒక స్టాండ్ తీసుకొని నిక్కఛిగా ఏ విషయాన్ని చెప్పరని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. కొడుకు కాపురాన్ని దిద్దడానికి నాగార్జున వల్ల కాలేదు, అలాగే బిగ్ బాస్ లోని వాళ్ల గురించి గట్టిగా మాట్లాడటానికి కుదరడం లేదని, ఆయన ఓ పిరికిపంద అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -