Pooja Murthy: శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు.. పూజామూర్తి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Pooja Murthy: ఎక్కడో విదేశాల్లో పుట్టి భారతదేశంలో అన్ని భాషలలో కూడా సక్సెస్ అవుతున్న టీవీ షో బిగ్ బాస్. తెలుగులో కూడా కొన్ని ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి కానీ బిగ్బాస్ 6 ప్లాప్ అవ్వటంతో బిగ్ బాస్ 7 ని చాలా కొత్తగా డిజైన్ చేశారు నిర్వాహకులు. వాళ్ళ అంచనాలని వొమ్ము చేయకుండా ప్రేక్షకులు కూడా షోకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులని అలరిస్తూ సెవెంత్ సీజన్ బిగ్ బాస్ కూడా ప్రేక్షకులని బాగానే అలరిస్తుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం సర్వసాధారణం. అలాగే వారు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతాయి. ఎందుకంటే మనం చూసిన బిగ్ బాస్ వేరు వాళ్ళు చెప్తున్న బిగ్ బాస్ వేరు. అలాగే ఏడో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పూజ మూర్తి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. శివాజీ ఎక్కువగా ప్రశాంత్, యావర్లను సపోర్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ విషయాన్ని చెప్తే ఆయన ఒప్పుకోడు.

సపోర్ట్ చేసినప్పుడు మనం కేవలం పుష్ చేయగలం కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్ గానే ఉన్నారు, వీళ్ళిద్దరికి అయితే అందరికంటే ఎక్కువగా సపోర్టు చేస్తున్నారు. అతను ఆడటం లేదు కానీ ఆడిస్తున్నాడు అంటూ శివాజీ గురించి చెప్పుకొచ్చింది. అలాగే అమర్ దీప్ గురించి కూడా కామెంట్స్ చేసింది పూజ మూర్తి. అతను నాకు బయట బాగా తెలుసు కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయాడు.

తన ఒరిజినల్ క్యారెక్టర్ ని వదిలేసుకున్నాడు. తను అందగాడిని అని చెప్పుకునే అమర్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పని చేశాను. బయట చూసిన అమర్ వేరు, లోపల కనిపిస్తున్న అమరు వేరు. అతను పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు అని చెప్పుకొచ్చింది పూజ మూర్తి. ఇప్పుడు ఈ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -