Bhanu Sri Mehra: బిగ్ బాస్ చెత్త షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Bhanu Sri Mehra: అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం వరుడు ఈ సినిమా అప్పట్లో భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా నటి భాను శ్రీ మెహ్రా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. అయితే మొదటి సినిమాతోనే ఈమె భారీ డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో తన కెరియర్ పెద్దగా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదని చెప్పాలి..

ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రావడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో కాలం వెళ్ళదిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈమె హీరోగా నటించిన లియో సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఈ విధంగా భాను శ్రీ మెహ్రా సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు కారణంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఇక తనని అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచినటువంటి ఈమె అనంతరం తన వీడియోలు చూడాలి అంటూ అల్లు అర్జున్ కు ట్యాగ్ చేస్తూ ఉండటంతో ఒకసారిగా అల్లు అర్జున్ అభిమానులు ఈమెపై భారీగా ట్రోల్స్ నిర్వహించారు. ఇలా తరచూ ఏదో ఒక వివాదం ద్వారా ఈమె ఫేమస్ అయ్యారు.

తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలో వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఎందుకు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తున్నారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని తెలిపారు. నా దృష్టిలో ఈ కార్యక్రమం ఒక చెత్త షో అని తన ఇంస్టా ఫీడ్ అంతా కూడా బిగ్ బాస్ వీడియోలతోనే నిండిపోయిందని తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం చెత్త షో అంటూ ఈమె హిందీ సీజన్ ని ఉద్దేశించి అన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు అన్ని భాషలలో బిగ్ బాస్ కార్యక్రమానికి వర్తించడంతో ఈమె మరోసారి వార్తల్లో నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -