Anu Emmanue: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వసివో, రాక్షసివో. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించారు. అచ్చం నిజ జీవితంలో లవర్స్ లాగే ప్రవర్తిస్తూ నటనలో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై పుకార్లు మొదలయ్యాయి. అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ కలిసి డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఊర్వసివో, రాక్షసివో సినిమాలో కొన్నిరొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ప్రేమ, డేటింగ్ లాంటి కాన్సెప్ట్‌లతో ఈ మూవీ తెరకెక్కించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు విడుదలైనప్పటి నుంచి వీరిపై ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించింది నటి అను ఇమ్మాన్యుయేల్.
సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు కామన్‌గా వస్తుంటాయని, అలాంటి వార్తలను తాను పట్టంచుకోనని కొట్టి పారేసింది. అసత్య వార్తలను తాను లైట్ తీసుకుంటానని అను అమ్మాన్యుయేల్ చెప్పింది. అయితే, ఈ తరహా వార్తలకు తన తల్లి బాగా బాధపడుతోందని వాపోయింది. ఇలాంటి పుకార్లు వద్దని హితవు పలికింది.
అల్లు అరవింద్ ఇంటికి పిలిపించి అడిగారు..
ఒకరోజు అల్లు అరవింత్ తన ఇంటికి పిలింపించి శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా? అంటూ అడిగారని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. శిరీష్‌తో పుకార్ల గురించి ఇద్దరూ మాట్లాడుకొని కొంత సేపు సరదాగా నవ్వుకున్నామంటూ చెప్పింది ఈ అమ్మడు. మరోవైపు ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. రొమాంటిక్ సీన్లు ఉండటంతో యువత ఆసక్తిగా మూవీని చూడటానికి ఇష్టపడుతున్నారు.