Naresh: ఆ సినిమాలపై నరేష్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Naresh: సినీ ఇండస్ట్రీలో రిమేక్ సినిమాలు ఎక్కువగా డబ్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య ఎక్కువ అయిందనే చెప్పుకోవచ్చు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా.. సినిమా హిట్ అయితే చాలు ఆ మూవీని రీమేక్ చేసి పడేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలకు అలవాటు పడుతున్నారు. సక్సెస్‌ఫుల్ స్టోరీతో మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. టాలీవుడ్ సినిమాలు కూడా చాలా వరకు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. చాలా వరకు ప్రజలకు భాష మీద పట్టు సాధించారు. ఇప్పుడంటే ఈజీగా రీమేక్ చేస్తున్నారు. కానీ, అప్పట్లో సినిమా రీమేక్ చేయాలంటే అంత సాధ్యమైన పని కాదు. అప్పట్లో స్టోరీ కంటెంట్, సినిమా తీయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అయినా కొందరు దర్శకులు రిస్క్ తీసుకుని మరీ రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా సీనియర్ నటుడు నరేష్ రీమేక్ సినిమాలపై షాకింగ్ కామెంట్లు చేశాడు.

 

తన సినిమాలను రీమేక్ చేసే సత్తా సినీ ఇండస్ట్రీలో ఎవరికీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నరేష్. ఫ్యామిలీ, కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ.. తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అతి తక్కువ సమయంలో సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారారు. వయసు పైబడటంతో ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. హీరోయిన్, హీరోల తండ్రి పాత్రలు చేస్తూ.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. గతంలో మా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే నరేష్ మాత్రం నటుడిగా కాకుండా వ్యక్తిగతంగా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేశ్ తన వ్యక్తిగత విషయాలతోపాటు సినీ లైఫ్ గురించిన విషయాలు పంచుకున్నాడు. సినిమాల్లో లేడీ గెటప్ వేసుకోవాలని అనుకునే వాడినని, జంబలకడిపంబ సినిమాతో ఆ కోరిక తీరిందన్నారు. నేను నటించిన రెండు, మూడు సినిమాలను రీమేక్ చేసే సత్తా ఇండస్ట్రీలో ఎవరికీ లేదన్నారు. దీంతో ఈ కామెంట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -