Madhavi Latha: ఆ దర్శకుడి వల్ల నరకం అనుభవించానన్న మాధవీ లత!

Madhavi Latha: మాధవీ లత.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన మాధవి లత ఏఎస్ఎం మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుల్బర్గా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో ఆనర్స్ డిగ్రీ చేశారు. సినీ ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో తొలత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆ తర్వాత 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినట్లు.. డైరెక్టర్ రవిబాబు తనను బూతులు తిడుతూ టార్చర్ పెట్టాడని పేర్కొంది.

 

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సీని ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం అందం, టాలెంట్ మాత్రమే సరిపోదని, బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. నచ్చావులే సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతో టార్చర్ అనుభవించానన్నారు. డైరెక్టర్ రవిబాబు చెప్పింది విననప్పుడు బూతులు తిట్టే వాడని చెప్పుకొచ్చింది. షూటింగ్ మధ్యలో చెట్ల కింద కూర్చొబెట్టి దారుణంగా అవమానించేవాడని తెలిపింది. అప్పుడు ఎంతో టార్చర్ అనుభవించానని పేర్కొంది.

 

 

అయితే తెలుగు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉంటారనే విషయంపై మాట్లాడింది. సినిమా స్టోరీకి ఎంత అవసరమో.. అంత వరకు మాత్రమే ఎక్స్ పోజింగ్ చేస్తానన్నారు. అయితే కొందరు డైరెక్టర్లు ఏదో ఆశిస్తూ ముందుకు వస్తుంటారు. అలాంటి సమయంలో వారికి ఫేవర్‌గా ఉండకపోతే.. ఇండస్ట్రీలో ఎదగనీయకుండా చేస్తారన్నారు. సీని ఇండస్ట్రీలో అవకాశాలు రానియ్యకుండా అడ్డుపడతారని చెప్పుకొచ్చారు. కాగా, మాధవీ లత ఇప్పటివరకు ‘నచ్చావులే, ష్.., స్నేహితుడా, ఉసురు, అరవింద్-2, అంబాలా, చూడాలని చెప్పాలని, తొలిపాట’ వంటి సినిమాల్లో నటించారు. అలాగే మహేశ్ బాబు నటించిన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -