Allu arjun: బన్నీ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Allu arjun: సాధారణంగా బడా స్టార్ల వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో జీత భత్యాలు, బహుమతులు అందుతుంటాయి. సాధారణ డ్రైవర్ల కంటే హీరోలు, హీరోయిన్ల వద్ద, వారి కుటుంబీకుల వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారి జీవితం గొప్పగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే అందులో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ సోషల్ మీడియాలో రాసినంత, అందరూ ఊహించినంత పెద్దగా ఏమీ ఉండదంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్ద పని చేసే డ్రైవర్ లక్ష్మణ్.

 

తాజాగా ఓ టీవీ చానల్ యాంకర్ తో మాట్లాడిన అల్లు అర్జున్ క్యారవ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్ పలు విషయాలను పంచుకున్నాడు. తాను తొలుత స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద పని చేశానని తెలిపాడు. సుమారు ఐదున్నరేళ్ల పాటు బోయపాటి వద్ద డ్రైవర్ గా పని చేసినట్లు వెల్లడించారు. బేసిక్ గా తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తో ఫొటో దిగాలనే కోరిక ఉండేదన్నాడు. అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.

 

అందుకే అల్లు అర్జున్ వద్ద డ్రైవర్ గా చేరినట్లు తెలిపాడు లక్ష్మణ్. ఇప్పటికే బన్నీ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న మహిపాల్ అనే వ్యక్తి ద్వారా తాను ఈ పోస్టులోకి వచ్చినట్లు వివరించాడు లక్ష్మణ్. అల్లు అర్జున్ కొత్త క్యారవ్యాన్ చేయించినప్పటి నుంచి తానే డ్రైవర్ గా ఉన్నట్లు చెప్పాడు. బన్నీ చాలా మంచివాడని, ఉద్యోగులను మంచిగా చూసుకుంటాడని వివరించాడు.

 

ఊహించినట్లు అంత ఉండదు.. కానీ బెటర్
అలవైకుంఠపురం సినిమా హిట్ అయిన సందర్భంగా స్టాఫ్ అందర్నీ పిలిపించి బహుమతిగా నగదు అందించారని తెలిపాడు. ప్రత్యేకించి తన బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ గుర్తు పెట్టుకొని మరీ తన కోసం కేక్ తెప్పించి కట్ చేయించాడని ఇది జీవితంలో మరువలేనని లక్ష్మణ్ చెప్పాడు. ఇక జీతం విషయమై స్పందించిన డ్రైవర్ లక్ష్మణ్.. సోషల్ మీడియాలో రాసినట్లుగా, బయట ప్రజలు అనుకుంటున్నట్లుగా అంత రేంజ్ లో ఉండదని, కానీ సాధారణ డ్రైవర్ల కంటే బెటర్ గా ఉంటుందని తెలిపాడు. పండుగలు, సినిమాల హిట్ అయిన సందర్బాల్లో కానుకలు అందుతుంటాయని వివరించాడు.

 

https://www.facebook.com/SumantvEntertainment/videos/490605356349262/

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -