Tollywood: ప్రభాస్, పవన్‌లలో నంబర్ వన్ హీరో అతనేనా?

Tollywood: పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత హీరోయిన్ త్రిషతో కలిసి ‘వర్షం’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌నే మార్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘మున్నా’ సినిమా కూడా భారీ విజయాన్నే అందుకుంది. ‘బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి’ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి’ సినిమా ఆల్ టైం రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పెంచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్, ఆదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్నాడు.

 

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరగేట్రం చేశాడు. ‘సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం, జల్సా, పంజా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. జనసేన పార్టీ అధినేతగా కొనసాగుతూ.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రను కనబరుస్తున్నాడు. అయితే ప్రభాస్-పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ స్టార్ హీరోలే. ఫ్యాన్ ఫాలొయింగ్‌లో వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరూ నంబర్.1 అనే విషయంపై తాజాగా ఓ ఛానెల్ సర్వే నిర్వహించింది. ఇందులో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ నంబర్.1 స్థానంలో ఉన్నాడు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ విషయంలో పవన్ కళ్యాణ్ నంబర్.1 స్థానంలో కొనసాగుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -