Byreddy Sidharth Reddy: టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి

Byreddy Sidharth Reddy: వైసీపీ యువ నేత, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయపెట్టారు. ఒకప్పుడు టీడీపీలో చేరాలని అనుకున్న విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. వైసీపీలో చేరకముందు ఐదేళ్ల క్రితం తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన విషయాన్ని బైరెడ్డి సిద్దార్థరెడ్డి బహిర్గతం చేశారు. తన తల్లి ఉషారాణిరెడ్డిని కడప నుంచి టీడీపీ తరపున పోటీలోకి దింపడానికి గతంలో ప్రయత్నాలు చేసిన విషయాన్ని తాజాగా బయటపెట్టారు.

 

టీడీపీ నేతలే తన తల్లిని పోటీలోకి దింపాల్సిందిగా తన వద్దకు చాలాసార్లు వచ్చారని బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలిపారు. 2009,2014 ఎన్నికల్లో టీడీపీ వాళ్లు తన తల్లిని కడప నుంచి పోటీ చేయించాలని తనను కలిశారని, అంతకు తప్పితే తాను ఎవరినీ కలవలేదని బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలిపారు. తాను లోకేష్ ను లేదా చంద్రబాబును ఎవరినీ కలవలేదని, టీడీపీ వాళ్లే తనను కలిసినట్లు స్పష్టం చేశారు. తన దగ్గరకు టీడీపీ వాళ్లు ఎన్నిసార్లు వచ్చారో చంద్రబాబును అడిగి తెలుసుకోవాలంటూ సిద్దార్థ్ రెడ్డి ప్రశ్నించారు.

 

తాను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తో భేటీ అయినట్లు వచ్చిన వార్తలన్నీ పూర్తి అవాస్తవమని, తాను ఇటీవల అసలు కలవలేదన్నారు. టీడీపీలో చేరేందుకు ఐదేళ్ల క్రితం ప్రయత్నించానని, కానీ ఎవరి కాళ్లు పట్టుకోలేదన్నారు. ఎవరి ద్వారా తాను ప్రయత్నాలు చేయలేదని బైరెడ్డి సిద్దార్థరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను లోకేష్ ను కలిసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు. కావాలని తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జగన్‌కు వీర విధేయుడిగానే ఉంటానని తెలిపారు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -