Kalyan Ram: ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న కళ్యాణ్ రామ్.. కథ ఏంటంటే?

Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఫాంటసీ మూవీగా వచ్చి సంచలన విజయం సాధించింది బింబిసార. ఇక అలాంటి క్రేజీ సబ్జక్ట్‌లతోనే తెలుగు ప్రేక్షకులను అలరించాలని కల్యాణ్ రామ్ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే బింబిసార 2 సినిమాతో వస్తాడని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ నందమూరి కథా నాయకుడు మాత్రం.. ఓ కొత్త పోస్టర్‌తో దర్శనమిచ్చాడు. ఎమిగోస్ టైటిల్ తో కనిపించాడు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

 

ఇందులో అసలైన ట్విస్టు ఉండేలా కల్యాణ్ రామ్ కనిపించాడు. మనలాగే ఉన్న మరో మనిషి మనకు కనిపిస్తే చచ్చిపోతాం.. అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ను జోడించారు. దాంతో పాటు కళ్యాణ్‌ రామ్ మూడు అవతారాల్లో కనిపించాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

 

ఈ మూవీలో మూడు రోల్స్ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందు కోసం బాగా జుట్టు కూడాపెంచేశాడు. జుట్టు పెంచి ఓ పాత్ర, మిలటరీ కటింగ్ లో ఓ రోల్, స్పెడ్స్ తో మరో రోల్ లో దర్శనమిస్తున్నాడు. ఓ పాత్ర చేతిలో గన్, ఒకరి చేతిలో బ్యాగ్, మరొకరి చేయి ఖాళీ ఉండటంతో.. మూడు గెటప్ లు కూడా విభిన్నమైనవేనంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

 

టాలీవుడ్ లో త్రిపాత్రాభినయం ఎవరెవరంటే..
తెలుగు మూవీల్లో త్రిపాత్రాభినయం చాలా తక్కువ మందే చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు. ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కూడా ట్రిపుల్ యాక్షన్ మూవీలు తీశారు. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు మూవీలో ముగ్గురిగా కనిపించాడు. బాలయ్య కూడా ఓ మూవీలో ముగ్గురిగా కనిపించాడు. ఇక లేటెస్ట్ గా కళ్యాణ్‌ రామ్ కూడా మూడు గెటప్ లలో కనిపించనుండడంతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో డబుల్ యాక్షన్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -