Samantha: టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. తెలుగులోకి ‘ఏమాయ చేసావె’ సినిమాతో అడుగు పెట్టిన సమంత.. ఒక్కో సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోని టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన సమంత.. తమిళంలోనూ టాప్ హీరోలతో పని చేసింది. దక్షిణాది సినిమాలతో పాటు హిందీలో ‘ఫ్యామిలీమ్యాన్2’ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
ఈనెల 11వ తేదీ సమంత హీరోయిన్ గా చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన ఆరోగ్యం గురించి, యశోద సినిమా గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది. చాలాకాలంగా సమంత ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు రాగా.. వాటన్నింటికీ ఆమె స్పష్టతనిచ్చింది.
సమంత.. తన అనారోగ్యం బాగోలేదనే విషయాన్ని వెల్లడించింది. అలాగే తన పరిస్థితి కొన్ని రోజులు దారుణంగా ఉండిందని, ఇప్పటికైతే ఓకేగానే ఉందని సమంత వివరించింది. ఇక తన గురించి కొన్ని వెబ్ సైట్లలో రకరకాలుగా రాసుకొచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది.. పిచ్చిపిచ్చి వార్తలు వచ్చాయని చెప్పింది.
తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయని సమంత వివరించింది. అయితే తాను అంతా ఓకేగా ఉన్నానని, తాను బ్రతికే ఉన్నానని సమంత తెలిపింది. కాగా తన పరిస్థితి గురించి సమంత వివరిస్తూ.. కంటతడి పెట్టుకుంది. అన్ని రోజులు ఒకలాగా ఉండవని, తనకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోందని చెప్పింది.