Samantha: నా జీవితంలో కష్టాలు వచ్చాయి.. చూడాలి: సమంత

Samantha: టాలీవుడ్ లో హీరోలకు ఎంతైతే క్రేజ్, గుర్తింపు ఉంటుందో.. హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్, ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఫాలోయింగ్ ను కలిగిన హీరోయిన్ల జాబితాలో ఖచ్చితంగా హీరోయిన్ సమంత ఉంటుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతో వైవిధ్యాన్ని కనబర్చింది. అందుకే ఆమెకు గ్లామర్ డాల్ అనే ముద్ర లేకుండా స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు లభించింది.

 

ఇక తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత అధికారికంగా ప్రకటించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.సమంత త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకోగా.. ఆమె ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులను పలకరించింది. త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతున్న తన సినిమా ‘యశోద’ గురించి, తన జీవితం గురించి కొన్ని విషయాలను పంచుకుంది.

 

‘యశోద’ సినిమా సరోగసి నేపథ్యంలో తెరకెక్కిందని, రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించే కథ ఇందులో ఉందని సమంత వివరించింది. సినిమాలో యశోద క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని ఆమె తెలిపింది. సినిమాలో యశోద క్యారెక్టర్ చుట్టూ కష్టాలు అల్లుకుంటాయని, అలాగే తన జీవితంలో కూడా కష్టాలు వచ్చాయని సమంత వివరించింది.

 

యశోద సినిమాలో మాదిరిగా తన రియల్ లైఫ్ లో కూడా కష్టాలు వచ్చాయని వివరించిన సమంత.. వాటిని సినిమాలో ఎలాగైతే ఎదుర్కొన్నానో, రియల్ లైఫ్ లో కూడా ఎదుర్కొంటానని ఈ క్యూటీ తెలిపింది. ఓసారి తాను ఇంక ముందుకు కదలనేమో అనుకున్నానని.. కానీ జీవితంలో ఇంత వరకు వచ్చింది చూస్తే ఆశ్చర్యమేసిందని సమంత వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -