Pawan Kalyan-Ali: పవన్ పై అలీ సంచలన వ్యాఖ్యలు.. ఏమని అన్నారంటే?

Pawan Kalyan-Ali: సినిమా ఇండస్ట్రీలో చాలామంది మంచి స్నేహితులుగా ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగిన వారు పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీలు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమాలో అలీ కనిపిస్తూ ఉంటాడు. అయితే గత రెండు సినిమాల నుండి అలీ లేకుండానే పవన్ సినిమాలు వచ్చాయి. దీంతో వీరిద్దరికి చెడిందనే వార్తలు వస్తున్నాయి.

 

నిజానికి ఇలా వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ను కాదని, అలీ వైసీపీలో చేరిన నాటి నుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే నేరుగా ఇప్పటి వరకు వీరిద్దరు విమర్శలు చేసుకోలేదు. కానీ తాజాగా అలీ మాత్రం పవన్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అలీ పలు వ్యాఖ్యలు చేశారు.

 

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అలీ అన్నారు. పేదల కోసమే జగన్ సర్కార్ పని చేస్తోందన్న అలీ.. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు అప్పనంగా అన్ని సీట్లు ఇవ్వలేదని అలీ కామెంట్ చేశారు. ప్రజలు జగన్ ను నమ్మారని.. జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుందనే గెలిపించారని అలీ అన్నారు.

 

అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ ను జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ కామెంట్లు చేస్తే అందులో ఏమాత్రం అర్థం లేదని అలీ అన్నారు. రాజధాని ఏది అయినా అభివృద్ధి మాత్రం అన్ని చోట్లా జరుగుతుందని అలీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అలీ మరియు పవన్ ల మధ్య కలపలేనంత దూరం పెరిగిపోయిందని, రాజకీయాల కారణంగానే ఇది ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -