Allu Arjun: టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ తన మంచి మనసును చాటుకున్నాడు. సమస్య ఉందని తన దగ్గరికి ఎవరైన వచ్చి చేయి చాచి అడిగితే కాదనుకుండా ఇచ్చే గొప్ప మనసు అల్లు అర్జున్‌ది. కష్టాల్లో ఉన్న తన సిబ్బందికి సాయం చేసి మరోసారి అల్లు అర్జున్ అండగా నిలబడ్డాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బన్నీ దగ్గర మహిపాల్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా బన్నీ దగ్గరే డ్రైవర్‌గా ఉంటున్నాడు. మహిపాల్ ఎంతో నమ్మకంగా ఉండటంతో బన్నీనే తన పర్సనల్ డ్రైవర్‌గా కొనసాగిస్తున్నాడు.
అయితే మహిపాల్ బోరబండలో ఓ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ మహిపాల్ కుటుంబ సభ్యులను కలిశాడు. రూ.15 లక్షల ఆర్థికసాయం చేశాడు. బన్నీ ఆర్థికంగా ఆదుకోవడంతో మహిపాల్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిన్న కేరళలోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి కూడా బన్నీ ఆర్థికంగా భరోసా ఇచ్చాడు. తండ్రిని పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఆ విద్యార్థిని చదువులో మెరిట్ స్టూడెంట్. దీంతో హయ్యర్ స్టడీస్ కోసం అయ్యే ఖర్చంతా అల్లు అర్జున్ ఇస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బన్నీ గోప్యంగా ఉంచారు. కానీ అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కృష్ణ తేజ తన పోస్టులో ఇలా రాసుకొచ్చాడు. ‘కొద్ది రోజుల క్రితం నన్ను ఓ విద్యార్థిని కలిసింది.
కోవిడ్ పీరియడ్‌లో గతేడాది ఆమె తండ్రి మరణించాడు. ఇంటర్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. హయ్యర్ స్టడీస్ చదువుకోలేని పరిస్థితి. నర్సింగ్ చేయాలనేదే ఆమె డ్రీమ్. ‘వీ ఆర్ ఫర్ అలెప్పీ’ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థినికి సాయం చేయాలనుకున్నాం. కానీ మెరిట్ కోటాలో దరఖాస్తు చేసుకునే టైం ముగిసింది. మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయగా.. కట్టనమ్లోని సెయింట్ థామస్ నర్సింగ్ కళాశాలలో సీటు దొరికింది. ఆర్థికంగా ఆదుకోవడానికి ఓ స్పాన్సర్ కావాల్సి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్‌కు చెప్పా. దానికి అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నాడు. విద్యార్థిని చదువుకు కావాల్సిన పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు.’ అని అలెప్పీ కలెక్టర్ తెలిపారు.