Shruti Haasan: శృతి హాసన్‌కు యంగ్ జనరేషన్ స్టార్స్ ఛాన్స్ ఇవ్వరా?

Shruti Haasan: విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లైంది. అయితే మొదట్లో ఆమె చేసిన దాదాపు అన్నీ సినిమాలు ప్లాపులయ్యాయి. దీంతో ఆమెను నిర్మాతలందరూ ఐరన్‌లెగ్‌గా ముద్ర వేశారు. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ కూడా పెరిగింది. దాంతో ఆమెకు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది.

 

కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అయితే శృతి ఇప్పటివరకు సీనియర్ హీరోల సరసన నటించింది. దీని వల్లే ఆమె కెరీర్ డ్రాపౌట్ అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆమె కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని తీస్తున్న బాలయ్య సినిమాను శృతికి ఛాన్స్ ఇచ్చాడు. అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమాలో కూడా శృతి హీరోయిన్‌గా నటిస్తోంది.

 

అయితే శృతిహాసన్‌కు ఇంకా చాలా భవిష్యత్ ఉంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడే కెరీర్ పీక్స్ లో కొనసాగుతోంది. సీనియర్ హీరోల సరసన ఇప్పుడు నటించడం వల్ల ఆమె భవిష్యత్‌కు పెద్ద ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. సీనియర్ హీరోల సరసన నటించడం వల్ల యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వరు. కానీ ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో మరో బిగ్ ఆఫర్ ఉంది.

 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా మంచి హిట్ అందుకుంటే మాత్రం శృతి హాసన్ కెరీర్ మొత్తాన్ని టర్న్ అవ్వనుంది. బాలీవుడ్‌లో మళ్లీ ఆమెకు ఛాన్సులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ అయినా.. ఆమెను ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -