Pawan Kalyan: కారు టాప్‌పై ప్రయాణం.. పవన్ కల్యాణ్‌పై మరో పోలీస్ కేసు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఇళ్ల కూల్చివేతకు గురైన గురైన బాధితులను పరామర్శించారు. వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సహాయం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగానే ఇళ్లు కూల్చివేసినట్లు ప్రభుత్వం చెబుతుండగా.. జనసేన ఆవిర్భావ సభకు ఇళ్లు ఇచ్చినందుకే ఇళ్లను కూల్చివేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి.

 

దీంతో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కారు టాప్ పై కూర్చుని ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోటార్ వెహికల్ చట్టం కింద కేసు పెట్టారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నెంబర్ 817/2022గా కేసు నమోదు అయింది.

 

తెనాలిలోని మారిస్ పేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాష్ డ్రైవింగ్ చేయడం, కారుపై కూర్చోని వెళ్లడం, నేషనల్ హైవే వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించంపై ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటం గ్రామంకు వెళ్లే సమయంలో పోలీసులు పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కారు టాప్ పై కూర్చోని వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు కురిపిస్తోన్నారు. ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ఇలా కారు టాప్ పై కూర్చోని ప్రయాణించడం ఏంటని కొంతమంది పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -