Super Star: కృష్ణతో నటిస్తే అలాంటి పేరు వస్తుందని హీరోయిన్లు భావించేవారా?

Super Star: టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. 350కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని పొందుపర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు. తండ్రి రాఘవయ్య చౌదరి, తల్లి నాగరత్నమ్మ. నటనపై ఉన్న మక్కువతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ‘తేనే మనసులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు చేయడంతో.. కృష్ణ సూపర్ స్టార్‌గా ఎదిగారు. కృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌ను చూసి ఎందరో నటీమణులు తనతో జతకట్టాలని భావించేవారు. ఆయన సతీమణి విజయ నిర్మల కూడా దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించారు. వందలాది హీరోయిన్లు కృష్ణతో జోడికట్టాయి.

 

1965లో తెరకెక్కించిన ‘తేనేమనసులు’ సినిమాతో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సుకన్య నటించింది. రెండో సినిమా ‘కన్నె మనసులు’లో హీరోయిన్‌గా సంధ్యారాణి నటించారు. ఆ తర్వాతి సినిమా ‘గూఢచారి 116’లో హీరోయిన్ జయలలితతో జోడి కట్టారు. ‘సాక్షి’ సినిమాతో తొలిసారిగా విజయ నిర్మలతో కలిసి కృష్ణ నటించారు. వాణి శ్రీ, రాజ శ్రీ వంటి యంగ్ హీరోయిన్లతో కూడా నటించారు. జమున, కాంచన, భారతి, శారద, విజయలలిత, జ్యోతిలక్ష్మి తదితర హీరోయిన్లతో నటించి ప్రేక్షకులను అలరించారు. కృష్ణ ఎవరితో నటించిన హిట్ పెయిర్‌గా విజయ నిర్మలనే నిలిచారు.

విజయ నిర్మలతో కలిసి ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు’ సినిమాల్లో హీరోయిన్‌గా విజయనిర్మల నటించారు. ఈమె తర్వాత కృష్ణ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది జయప్రద. ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, ఈనాటి బంధం ఏ నాటిదో, దొంగలకు దొంగ, దొంగల వేట, అల్లరి బుల్లోడు, అతనికంటే ఘనుడు, కుమార రాజా, కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, ఊరికి మొనగాడు, రహస్య గూఢచారి, ప్రజారాజ్యం’ తదితర సినిమాల్లో జయప్రద హీరోయిన్‌గా నటించారు. జయచిత్ర, జయసుధ, రంభ, విజయశాంతి, భానుప్రియ, రోజా, సౌందర్య, రమ్యకృష్ణ వంటి టాప్ హీరోయిన్లు కూడా సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించి ఆకట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -