Anasuya: క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!

Anasuya: యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే.. జబర్దస్త్ షోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. కెరీర్‌లో దూసుకెళ్తోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేయడం వల్ల ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పొందగలిగింది. అలా సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. జబర్దస్త్ స్టేజ్‌పై తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారును ఊర్రూతలూగించింది. అప్పటివరకు నార్మల్‌గా సాగే షోలు.. అనసూయ మాస్ పర్ఫార్మెన్స్ తో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారాయి. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలతో నాగార్జున మరదలి పాత్రలో నటించి.. అందరినీ తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పెంచేలా చేశాయి. వరుస సినిమాలను అందిపుచ్చుకుని.. కెరీర్ ఎక్కడా డ్రాప్ కాకుండా చూసుకుంటోంది.

 

 

అయితే జబర్దస్త్ లో తొమ్మిది ఏళ్లు ఉన్న అనసూయ.. ఇటీవలే బయటికి వచ్చేసింది. ఈటీవీకి గుడ్‌బై చెప్పి.. స్టార్ మాతో అగ్రిమెంట్ చేసుకుంది. అక్కడ.. ‘సూపర్ సింగర్ జూనియర్’ షోకు సుధీర్‌తో కలిసి హోస్ట్ గా అలరించింది. అయితే ఈ షో పెద్ద క్రేజ్ సంపాదించలేదు. షో కూడా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అనసూయకు ఆఫర్లు కూడా తగ్గాయి. సూపర్ సింగర్ జూనియర్ షో ఆగిపోవడంతో అనసూయ బుల్లితెరపై కూడా కనిపించకుండా పోయింది. అయితే తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఆ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్‌పై అనసూయ మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఛాన్స్ ఇస్తామని వచ్చి.. అడగరానికి అడిగినప్పుడు ఆ ఆఫర్‌ను వదులుకోవడమే బెటర్. అలాంటి ఆఫర్స్ వందల్లో దొరుకుతాయి. నన్ను కూడా చాలా మంది కమిట్‌మెంట్స్ కావాలని అడిగారు. కమిట్‌మెంట్స్ ఇవ్వనందుకే రెండేళ్లపాటు ఛాన్సులు లేకుండా గడిపాను. నాలా ధైర్యంగా లేని చాలా మంది ఆడపిల్లలు కాస్టింగ్ కౌచ్‌కి బలవుతున్నారు. మనలో టాలెంట్ ఉంటే కచ్చితంగా ఆఫర్లు వస్తాయి. మనం చేయాల్సిందల్లా.. సరైన సమయం కోసం ఎదురు చూడటమే.’ అని అనసూయ చెప్పుకొచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -