Indu Anand: తన కుమార్తె గురించి షాకింగ్‌ విషయాలు చెప్పిన నటి ఇందూ ఆనంద్‌!

Indu Anand: సినిమాల్లో, సీరియళ్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు సీనియర్‌ నటి ఇందూ ఆనంద్‌. ప్రస్తుతం అనేక సీరియళ్లలో ఇంటి పెద్ద పాత్రలో నటిస్తూ అలరిస్తున్నారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అనేక చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి ఇందూ ఆనంద్‌.. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, షూటింగ్‌ల సందర్భంగా ఎదుర్కొన్న విషయాలను వివరించారు.

 

తనకు ప్రస్తుతం నడుస్తున్న జీవితం ఆనందంగా సాగిపోతోందని నటి ఇందూ ఆనంద్‌ తెలిపారు. జీవితంలో బాగా ఎక్కువగా సంపాదించాలనే ఆశ తనకు లేదని స్పష్టం చేశారామె. ఇంకా ఏదో సాధించాలనే ఆలోచనగానీ, రిచ్‌ లైఫ్‌ అనుభవించాలనే కోరికలు తనకు లేవని చెప్పారు. ప్రస్తుతానికి భగవంతుడి దయ వల్ల అంతా సాఫీగా సాగిపోతోందని వెల్లడించారు.

అయితే లైఫ్‌లో ఒకానొక సమయంలో తాను చాలా సమస్యల్ని ఫేస్‌ చేశానని సీనియన్‌ నటి తెలిపారు. గైనిక్‌, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా తనకు 10 సర్జరీలు జరిగాయని తెలిపారు. దాదాపు అన్నీ మేజర్‌ ఆపరేషన్లేనని చెప్పారు. అయినప్పటికీ జీవితంలో తాను భయపడలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు శారీరకంగా అంతా పర్‌ఫెక్ట్‌గా ఉందని వెల్లడించారు.

దేవుడిచ్చిన వరం నా కూతురు..
జీవితంలో ఇతరులకు ఇబ్బంది కలిగించడం తనకు ఇష్టం ఉండదని నటి చెప్పారు. ఎవరికి ఉన్న జీవితంలో వారు సంతోషంగా గడపాలనేదే తన ఉద్దేశమన్నారు. జీవితంలో చాలా సంవత్సరాలు బతకాలన్న ఆశ కూడా తనకు లేదన్నారు. అందరి జీవితాలూ ఇంట్రస్టింగ్‌గా ఉండబోదని, ఏదో ఒకటి చేసి ఇంట్రస్టింగ్‌గా కొందరు మార్చుకుంటున్నామని తెలిపారు. అనవసరంగా ప్రపంచంలోని వ్యక్తులను కష్టపెట్టడం, బాధపెట్టడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. తన కుమార్తె గురించి చెబుతూ కాస్త ఎమోషనల్‌ అయ్యారు నటి ఇందూ ఆనంద్‌. ఆమె తనకు దేవుడిచ్చిన వరం అని, ఎంత అల్లరి చేసినా హ్యాపీగా అనిపించేదని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -