Radhika: వైరల్ అవుతున్న రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

Radhika: ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న చిత్రంగా విడుదలై.. భారీ విజయాన్ని అందుకున్న సినిమా చాలానే ఉన్నాయి. అలాంటి చిత్రమే తమిళ మూవీ ‘లవ్ టుడే’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. తమిళనాడులో సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాడు. సినిమా డబ్బింగ్ పూర్తవడంతో.. చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించింది. ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా సినిమా ట్రైలర్, మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ..‘లవ్‌టుడే సినిమా తెలుగు టైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలోని పాటలు నన్ను ఎల్లప్పుడూ వెంటాడుతున్నాయి. ఉదయం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నా మైండ్‌లో ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎంతో ఇంపాక్ట్ చేశాయి.’ అని తెలిపారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ హీరో ప్రదీప్ రంగనాథ్. తెలుగు డబ్బింగ్‌లో హీరోగా ప్రదీప్ రంగనాథ్ నటించారు. అయితే డైరెక్టర్ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఈ సినిమా హిట్ అవుతుందని రాధిక శరత్ కుమార్ తెలిపారు.

తెలుగులో స్టార్ హీరోల సినిమాలను ఆదరించినట్లు.. లవ్‌టుడే సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని రాధికా శరత్ కుమార్ అన్నారు. నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారని తెలియగానే చాలా సంతోషపడ్డానని రాధిక శరత్ కుమార్ తెలిపారు. అయితే తాను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని రాధిక పేర్కొన్నారు. చాలా మంది హీరోలు, డైరెక్టర్లతో కలిసి పని చేశానన్నారు. లవ్‌టుడే సినిమా చూసిన తర్వాత భాగ్యరాజ్ రూపొందించిన ఓ చిత్రం గుర్తొచ్చిందని రాధిక తెలిపారు. ఆ సినిమా చూసిన తర్వాత థియేటర్లలో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నామన్నారు. గతంలోలాగా ఒకరిపైనే ప్రేమ పరిమితం కాలేదని రాధిక అన్నారు. నాకు ఒకరే లవర్ ఉన్నారని చెప్పే ధైర్యం ప్రస్తుతం ఎవరికీ లేదన్నారు. ప్రజెంట్ జనరేషన్‌లో కాఫీ తాగడానికి ఒకర్నీ, తిరగడానికి మరొకరిని మెయిన్‌టేన్ చేస్తున్నారని రాధిక ఆరోపణలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -