Punch Prasad: నవ్వించడం దేవుడు ఇచ్చిన వరం. అదీ అందరికీ సాధ్యం కాదు. అయితే ఇలా నవ్వులు పండించే కళాకారుల జీవితాల్లో కూడా చాలా విషాదాలు ఉంటాయి. జబర్దస్ట్ షోతో పరిచయమైన పంచ్ ప్రసాద్ జీవితం కూడా ఇలాంటి కోవకు చెందిందే. ఓ పక్క తను భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న పైకి మాత్రం నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ కనిపిస్తాడు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తనంతట తాను నడవలేని స్థితిలో ఆయన ఉన్నాడు.
అయితే ఈయన కొంతకాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో తను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఆయన తెలిపారు. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే నా కిడ్నీ వ్యాధి గురించి తెలిసినా తన భార్య తనను పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చాడు. కిడ్నీ సమస్య ఉన్నవాడని పెళ్లి చేసుకోవద్దని ఎంతమంది చెప్పినా వినకుండా నాతో జీవితం పంచుకుందని ఆమె భార్య గురించి చెప్పాడు. పెళ్లైన కొత్తలో అవినాష్వాళ్ల ఇంటి మేడ మీద అద్దెకు ఉండేవాళ్లమని ఆయన తెలిపాడు.
ఆ ఇంటిలో ఉన్నప్పుడు తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైందని, నోటి నుండి రక్తం కూడా వచ్చిందని ఆయన చెప్పారు. అప్పుడే ఈ విషయం తెలిసిన గెటప్ శ్రీను నా భార్యకు 50,000/- ఇచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించమని చెప్పాడని, అప్పుడు తన భార్య ఆస్పత్రిలో తనతోపాటు ఉంటూ చూసుకుందని ఆయన ఈ ఇంటర్వ్యూ తన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
అయితే పంచ్ ప్రసాద్ ఈ కష్టాలు తట్టుకోలేక చనిపోదామని కూడా అనుకున్నాడంట. అయితే అప్పడు వాళ్ల భార్య ధైర్యం చెప్పి అవసరమైతే తన కిడ్నీ ఇచ్చి అతన్ని బ్రతికించుకుంటానని చెప్పిందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా తనను పెళ్లి చేసకోడానికి ముందుకు వచ్చి అతనిని కంటికి రెప్పలా చూసుకుంటున్న అతని భార్యను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.