Punch Prasad: పంచ్ ప్రసాద్ కు ఆపరేషన్ పూర్తి చేయించిన జగన్ సర్కార్.. ఆ విషయంలో గ్రేట్ అంటూ?

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తూ ఎంతో మందిని నవ్వించినటువంటి పంచ ప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఇలా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం చాలా ఖర్చు కావడంతో పంచ్ ప్రసాద్ వెనకడుగు వేశారు.

ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమించడంతో మరొక కమెడియన్ నూకరాజు ఈయన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు ఎవరైనా సహాయం అందించాలని కోరారు. ఈ క్రమంలోనే పలువురు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందించారు ఈ క్రమంలోనే వేణు స్వామి సైతం ఈయన చికిత్స కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారు.

ఇక మంత్రి రోజా ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సర్జరీకి నిధులను మంజూరు చేయించారు. ఈ క్రమంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈయన సర్జరీకి అవసరమయ్యే డబ్బులు విడుదల కావడంతో యశోద హాస్పిటల్ లో ఈయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ పూర్తి అయింది ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది అంటూ ప్రసాద్ భార్య సునీత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

ఇక ఈ వీడియోలో భాగంగా పంచ ప్రసాద్ కూడా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. నాకు ఇదివరకే రోజా గారు సహాయం చేశారు అయితే ఇప్పుడు కూడా ఆమె నా ఆరోగ్య పరిస్థితిని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి తనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు విడుదల ఎలా చేశారని అందుకు తాను జగన్ ప్రభుత్వానికి జగన్ గారికి రుణపడి ఉంటాను అంటూ పంచ్ ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -