Punch Prasad: కన్నీళ్లు పెట్టుకున్న పంచ్ ప్రసాద్.. అన్యాయం జరిగిందంటూ?

Punch Prasad: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న పంచ ప్రసాద్ ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన హెల్త్ కండిషన్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రసాద్ కు రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఒకటి అతని భార్య ఇచ్చి ప్రసాద్ కాపాడుకుంది. అయితే మొన్నటి వరకు కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు లాంటి కామెడీ షోలలో కామెడీ చేసిన ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం మరింత ధననీయంగా మారింది.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రసాద్ కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పటికే చికిత్స కోసం తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టగా చివరికి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. పంచ్‌ ప్రసాద్‌ దీనస్థితి తెలిసి అతడిని ఆదుకోవడానికి ఇప్పటికీ ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అలాగే జబర్దస్త్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖు ఛానల్ తో ముచ్చటించిన పంచ్ ప్రసాద్ అతని భార్య నూకరాజు కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ..

 

నాకు హెల్త్ బాగాలేదు అని తెలిసి నాగబాబు గారు రోజా గారు జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామంది నాకు హెల్ప్ చేశారు. కిరాక్ ఆర్పి కూడా నాకు లక్ష రూపాయలు వరకు హెల్ప్ చేశాడు. నాకు తెలిసిన ఇద్దరు అక్కలు యూఎస్ఏ లో ఉంటారు వాళ్ళు కూడా నాకు బాగానే హెల్ప్ చేశారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఇక నా హెల్త్ కండిషన్ గురించి ఒక డాక్టర్ దగ్గరికి చూసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు తన సొంత ఖర్చులతో నా హెల్త్ కి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. ఇక ఆయన నాకు తాజాగా ఇలా ఎన్ని మందులు వాడినా లాభం లేదు సర్జరీ చేయించుకోవాల్సిందే అని చెప్పారు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ప్రసాద్. అనంతరం ఆయన భార్య మాట్లాడుతూ.. ఆయన చెప్పిన విధంగానే మాకు చాలా మంది అండగా నిలబడ్డారు. నూకరాజు మా ఆయనకు బాగోలేదు అన్న ప్రతిసారి వెనుక ఉండి ఒక సొంత తమ్ముడిలా చూసుకున్నారు అని తెలిపింది. ఇకపోతే పంచ్ ప్రసాద్ విషయానికి వస్తే మొన్నటి వరకు కూడా తాను లోపల ఎంత బాధ పడుతున్నా కూడా బయటకు మాత్రం ఆ బాధలేవీ కనిపించకుండా అబ్బాయికి అందర్నీ నవ్విస్తూ ఉండేవాడు. కానీ గత కొద్ది రోజులుగా ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రసాద్ పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరు కూడా తొందరగా కోలుకోవాలి ఆ దేవుడు చల్లగా చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -