Nag: నాగార్జున యంగ్ లుక్ వెనుక నిజాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Nag: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా రాణించాలంటే.. యాక్టింగ్, టాలెంట్‌తోపాటు అందం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుతం హీరో హీరోయిన్లు అందంగా కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్ చేస్తూ.. డైట్ మెయిన్‌టెన్ చేస్తుంటారు. అలాగే చాలా మంది హీరోయిన్లు తమ గ్లామర్‌ను పెంచుకోవడానికి సర్జరీలు కూడా చేసుకుంటారు. ఇలా ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు సర్జరీ కూడా చేసుకున్నారు.

అయితే టాలీవుడ్‌లో చాలా మంది సీనియర్ హీరోలు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. యంగ్ హీరోలకు ధీటుగా గ్లామర్ మెయిన్‌టెన్ చేస్తుంటారు. అలాంటి హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోలకు పోటీ పడుతూ.. సినిమాలు చేస్తున్నారు. గ్లామర్‌లోనూ పోటీ పడుతుంటారు. మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున.. అప్పట్లో స్మార్ట్ గా కనిపించేందుకు నానా తంటాలు పడేవారంట.

అప్పట్లో హీరోలు ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించేందుకు ఎంతో శ్రమించేవారు. నాగార్జునకు కూడా అలాంటి కష్టాలే ఎదురయ్యాయి. నాగార్జున ‘విక్రమ్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అప్పటికీ సన్నగా ఉండే నాగార్జునను డైరెక్టర్ రాఘవేంద్రరావు తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. కేవలం హీరోయిన్లే అందంగా కనిపించాలనే రోజుల్లో నాగార్జునను హ్యాండ్సమ్‌గా తయారు చేయాలని అనుకున్నాడు. దర్శకుడు రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్‌లో ‘ఆఖరి పోరాటం’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాఘవేంద్రరావు.. నాగార్జునను కాస్త బొద్దుగా తయారవ్వమని చెప్పాడట. కానీ సినిమా స్టార్ట్ అయ్యే నాటికి నాగార్జున బొద్దుగా తయారవ్వలేదు. దాంతో డైరెక్టర్ రాఘవేంద్రరావు.. ప్యాంటు, టీషర్టులో స్పాంజీలు వేశారట. అయితే ఆ బట్టలు వేసుకోవడానికి నాగార్జున ఎంతో ఇబ్బంది పడ్డారట.

ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జానకి రాముడు’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కూడా నాగార్జున కాస్త బొద్దుగా కనిపించాలని నాగార్జున చెప్పారంట. పల్లెటూరి కుర్రాడిలా కనిపించడానికి నాగార్జున జుబ్బాల లోపల రెండించుల స్పాంజ్ వేసి కుట్టించారట. అలా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో నాగార్జున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టే.. ఇప్పటికీ నాగార్జున స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -