Balayya: సినిమాల్లోకి బాలయ్య చిన్నకూతురు ఎంట్రీ.. సక్సెస్ అవుతారా?

Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలతో పాటు ఆహాలో అన్‌స్టాఫబుల్ విత్ ఎన్‌బీకే షోతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి అడుగులు పడలేదు. కానీ ఇప్పుడు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందనే ప్రచారం జరుగుతోంది.

 

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు తేజస్విని పనిచేస్తోంది. క్రియేటివ్ టీమ్‌లో ఆమె పనిచేస్తోంది. బాలయ్య లుక్ కొత్తగా కనిపించడం వెనుక తేజస్విని ఉందని చెబుతున్నారు . అందుకే బాలయ్య ఈ షోలో బాలయ్య స్ట్రైలిష్‌గా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారని చెబుతున్నారు. అయితే బాలయ్య ఆదిత్య 999 సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఆ సినిమాతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుండగా.. తేజస్విని కూడా అదే సినిమాతో సినీ అరగ్రేటం చేయనుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని బాధ్యతలను ఆమె తన భుజస్కంధాలపై వేసుకుందని తెలుస్తోంది. సినిమా స్టోరీ దగ్గర నుంచి కాస్టూమ్స్.. ఇలా రిలీజ్ వరకు అన్ని పనులు ఆమె పర్యవేక్షణలో జరగనున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

తండ్రికి, తమ్ముడికి లుక్ విషయంలో తేజస్విని కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక తేజస్విని నిర్మాతగా మారనుందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఓ హీరో సినిమాను ఆమె ప్రొడ్యూస్ చేయనుందనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తేజస్విని మాత్రం సినిమా ఇండస్ట్రీపై ఇప్పుడు కాస్త ఆసక్తి చూపుతుందని చెబుతున్నారు. అన్‌స్టాఫబుల్ షో దగ్గర ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో కాస్త పరిచయాలు ఏర్పాడ్డాయని, వీటిని బాగా కొనసాగిస్తారని చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఈ షో ఒక అడుగుగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -