Jagapathi Babu: ఆ ఛానల్ యాంకర్ జగపతి మధ్య అలా జరిగిందా?

Jagapathi Babu: తెలుగు సినీ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా వరకు హీరోగా నటించిన జగపతిబాబు ఈమధ్య విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు. అయిన.. ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. కెరీర్ మొదట్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేశాడు.

 

తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా కొంతకాలం తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ తో అడుగు పెట్టి కొత్తకొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 

హీరోగా కంటే ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ పాత్రలలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. అయితే ఇదంతా పక్కన పెడితే గతంలో జగపతిబాబు వ్యక్తిగతం గురించి చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ప్రేమ విషయంలో మాత్రం పుకార్లు వచ్చాయి. అప్పట్లో ఆయన స్టార్ హీరోయిన్ సౌందర్య తో ప్రేమాయణం నడిపినట్లు బాగా పుకార్లు వచ్చాయి.

 

ఆ తర్వాత కొంతకాలానికి ఆ పుకార్లకు బ్రేక్ పడగా.. మళ్లీ అతడు మరో జెమిని టీవీ స్టార్ యాంకర్ తో ప్రేమాయణం నడిపినట్లు తెలిసింది. ఓ ఈవెంట్లో వీరిద్దరికీ పరిచయం పెరగటంతో వారి మధ్య ప్రేమ పుట్టిందని.. దీంతో ఆ సమయంలో బాగా రాసుకొని.. పూసుకుని తిరిగారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ యాంకర్ జగపతిబాబుపై ప్రేమ పెంచుకోవడంతో పెళ్లి చేసుకోవాలని అడగడంతో జగపతిబాబు తనకు నో అని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని తెలిసింది. ఇక ఆ సమయంలో మాత్రం ఈ వార్తలు బాగా హాట్ టాపిక్ గా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -