Winter-Cold: చలికాలంలో జలుబు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఇది మీకోసమే?

Winter-Cold: ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకు చలి ప్రభావం పెరగటంతో ప్రజలు జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలకు ఆసుపత్రికి వెళ్లినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. అయితే హాస్పిటల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇటువంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంతకు అవేంటో తెలుసుకుందాం.

తులసి ఆకు: ప్రతిరోజు తులసి ఆకుల్ని నమ్మడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దరి చేరవు. అంతేకాకుండా తులసి ఆకులను మరిగించిన నీళ్లలో వేసి తాగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవే కాకుండా రాత్రి సమయంలో అయిదు తులసి ఆకులను నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది.

అల్లం: అల్లం శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అల్లం తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు దరి చేరవు.

వాము పొడి: ఒక చెంచా వాము పొడిని అర లీటర్ నీటిలో వేసి, ఒక చెంచా పసుపు వేసి చల్లారక తేనె కలిపి తాగడం వల్ల కఫం కరిగిపోతుంది. అంతేకాకుండా వామును మెత్తగా దంచి మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని పాలు: రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు వేసుకొని కలిపి తాగితే దగ్గు, జలుబు నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇక ఇవే కాకుండా కర్పూరాన్ని నువ్వుల నూనెలో కరిగించి తల, ఛాతి, పాదాలకు మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నల్ల మిరియాలను కషాయం చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు సమస్యలు దరి చేరవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -