Constipation: మలబద్ధకానికి 20 నిమిషాల్లో చెక్ పెట్టండిలా?

Constipation: మలబద్ధకం.. ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారికి వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. మలబద్దకం సమస్యకు ప్రధాన కారణం ఆహార పదార్థాలు. ఒక లిమిట్ అంటూ లేకుండా ఇష్టం వచ్చిన విధంగా ఏ ఆహారం అంటే ఆ ఆహారం విచ్చలవిడిగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలు అనగా అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలు తలెత్తి అది మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకం సమస్య అన్నది అది భరించే వారికి మాత్రమే తెలుస్తుందని చెప్పవచ్చు.

కొన్ని కొన్ని సార్లు అది తీవ్రం అయ్యి ఆపరేషన్ చేయడం వరకు కూడా వెళుతూ ఉంటుంది. అయితే చాలామందికి వేసవిలో ఈ మలబద్ధకం సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే నెయ్యిలో సహజ కొవ్వు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

 

అయితే పాలు, నెయ్యి కలిపి తాగడం వల్ల కేవలం మలబద్ధకం సమస్య మాత్రమే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎముకల బలహీనత సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో పాలు నెయ్యి కలిపిన పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలకు అందుతుంది. రాత్రిపూట పాలు, నెయ్యి కలుపుకుని తాగడం వల్ల శరీరం ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రతి రోజూ ఈ పాలను తాగడం వల్ల 8 గంటల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. స్టామినా పెంచుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నెయ్యి కలిపిన పాలను తాగాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -