Nayantara: వామ్మో పొట్టి దుస్తులు ధరించి విదేశాల్లో రచ్చ చేస్తున్న నయన్ దంపతులు!

Nayantara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార 2017వ సంవత్సరంలో దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో మొదటిసారిగా నేను రౌడీనే అని సినిమాలో నటించారు.ఈ సినిమాతోనే వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమ వరకు దారి తీసింది.

ఈ విధంగా గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం అయినప్పటి నుంచి ఈ జంటకు ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే విదేశాలకు పయనం అవుతున్నారు. తాజాగా ఈ జంట స్పెయిన్ హాలిడే వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లో పలు నగరాలలో విహరిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే విదేశాలలో అందమైన ప్రదేశాలలో తిరుగుతూ ఎంతో బ్యూటిఫుల్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట వీరి వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు.ఇందులో నయనతార పొట్టి దుస్తులు ధరించి రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ జంట జూన్ 9వ తేదీ వివాహం జరుపుకోవడంతో వీరి వివాహం తర్వాత నయనతార పూర్తిగా సినిమాలకు దూరమవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని నయనతార కొట్టి పారేస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -