Tollywood: నమ్రతకు చూసి నేర్చుకో.. స్నేహారెడ్డికి నెటిజన్ల సలహాలు వైరల్!

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోల మరియు హీరోయిన్ల విషయాలు తెలుసుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. తాము అభిమానించే హీరో రీల్ లైఫ్ నే కాదు, రియల్ లైఫ్ ని కూడా అభిమానులు ఆదరిస్తూ ఉంటారు. అందుకే వారికి వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు. ఒకరు స్టైలిష్ ఐకాన్ అయితే మరొకరు సూపర్ స్టార్. అయితే ఇప్పుడు వీరిద్దరి భార్యల గురించి పోలిక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అవును అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని, మహేష్ బాబు భార్య నమ్రతతో పోలిస్తూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి మరియు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం తెలిసిందే. అయితే ఈ మధ్యన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కాస్త హాట్ గా ఫోటోలకు పోజులిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందాలను ఆరబోస్తూ స్నేహారెడ్డి ఫోటోలకు పోజులివ్వడం చర్చనీయాంశమైంది.

మహేష్ బాబు భార్య నమ్రత.. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉండింది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది. కాగా మహేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత.. తన కెరీర్ ను త్యాగం చేయడంతో పాటు మహేష్ కు సంబంధించిన విషయాలను చూసుకోవడం, ఇంటిని, పిల్లలను చూసుకోవడం చేస్తోంది.

అయితే మహేష్ బాబు భార్య నమ్రత బాలీవుడ్ హీరోయిన్ అయినా ఆమె ఏనాడూ ఎక్స్ పోజింగ్ చేయలేదని కానీ అల్లు అర్జున్ భార్య మాత్రం ఇప్పుడు ఎక్స్ పోజింగ్ చేస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  ఒక దశ వచ్చాక ఎలా ఉండాలో అల్లు భార్య స్నేహారెడ్డి, మహేష్ భార్య నమ్రతను చూసి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -