Brahmanandam: బ్రహ్మానందం ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. అలా జరగడంతో?

Brahmanandam: తెలుగింట పరిచయం లేని పేరు బ్రహ్మానందం. ఆ మాటకొస్తే పేరు వినగానే నవ్వు తెప్పించేంత గొప్పగా తనదైన ముద్ర వేయగలిగారు బ్రహ్మానందం. ఒకానొక సమయంలో ఏ హీరో సినిమాలో అయినా బ్రహ్మానందం ఉంటే హిట్ అంతే.. అంతలా ప్రభావితమై చేయగలిగే నటనా కౌసల్యం బ్రహ్మానందం గారిది.

ఇక బ్రహ్మానందం తనయుడు, నటుడు రాజగౌతమ్ కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. “పల్లకిలో పెళ్లికూతురు” సినిమాతో తొలి అడుగు వేసిన రాజగౌతమ్.. ఆ తర్వాత వరుసగా బసంతి, మను, చారుశీల వంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక భవిష్యత్తులో కూడా మంచి మూవీలు అందించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

తాత అయిన బ్రహ్మీ..
ఇక ప్రస్తుతం బ్రహ్మానందం ఇంట ఆనందం వెల్లివిరిసింది. బ్రహ్మానందం కుమారుడు రాజాగౌతమ్‌ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాజగౌతమ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఒక ఫోటోను షేర్ చేస్తూ.. తన తనయుడు, సోదరిని ప్రేమగా చూస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

బ్రహ్మానందం తాత అవడంతో బంధువులు, వారి కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగిపోయారు. ఇక దీనితో అభిమానులు, సినీ ప్రముఖులు నెట్టింట శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా గౌతమ్ దంపతులు, బ్రహ్మానందంతో పాటు కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయారు. బ్రహ్మీ ఇంట మహాలక్ష్మి వచ్చిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -