Samantha Health: ఆరోగ్యం కోసం సామ్ సంచలన నిర్ణయం.. రిస్క్ చేస్తున్నారా?

Samantha Health: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయితే ఇటీవల అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ప్రాణాంతకమైన వ్యాధి మయోసైటిస్‌తో సమంత బాధపడుతోంది. ప్రాణాంతకమైన వ్యాధితో సమంత పోరాడుతోందని భారీ ఎత్తున కథనాలు వెలువడ్డాయి. సమంత తాజాగా నటించిన చిత్రం ‘యశోద’. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనప్పుడు తాను చనిపోయే పరిస్థితి లేదని, అదంత ప్రాణాంతకమైన వ్యాధి కాదని సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్‌లో సమంత అరోగ్యంపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఆమె మళ్లీ తన ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఈ విషయంపై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. సమంత అరోగ్యంగానే ఉందని, ఆమె ప్రస్తుతం ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన.. సమంత సడెన్‌గా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడటంపై నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత ముఖ కవళికలు మెరుగుపరిచేందుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకుంటోందని సమాచారం. వీలైనంత త్వరగా కోలుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన ‘ఖుషి’ సినిమాలో నటించనున్నారు. డిసెంబర్‌లో ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమంత పేర్కొంది. ఈ విషయాన్ని సమంత ఖుషీ మేకర్స్ కు తెలియజేసినట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే హీరో విజయ్ దేవరకొండకు మంచి విషయమని చెప్పవచ్చు. ఖుషీ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. కానీ సమంత అనారోగ్యానికి గురవ్వడంతో విజయ్‌కు శాపంగా మారింది. సమంత పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాను వేగంగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -