Adivi Sesh:అయ్యో.. అడివి శేష్ ఇలాంటి సైడ్ క్యారెక్టర్లు చేశాడా?

Adivi Sesh: పైవిద్యమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో కొత్త తరహా కథల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అడవి శేష్‌. అతను నటించిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. నటుడుగానే కాకుండా రచయితగా కూడా అడవి శేష్‌ తనలోని టాలెంట్ ను బయట పెట్టాడు.

సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేష్ తెరకెక్కించిన మేజర్ సినిమా మంచి ప్రజాదరణ అందుకుంది. ప్రస్తుతం ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నా అతని ఓవర్ నైట్ స్టార్ గా మారలేదు. చిన్న చిన్న పాత్రలు చేసి ఎన్నో సంవత్సరాల కఠోర కృషి తరువాత ఈరోజు ఈ పొజిషన్ కి చేరుకున్నాడు.

నిజానికి అడవి శేష్ తన కెరీయర్ని 2002 సొంతం చిత్రంతో మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నమిత ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి క్యారెక్టర్ లో అడవి శేష్ నటించాడు. సొంతం సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు దాటింది. అయితే ఈమధ్య రీసెంట్ గా ఆ మూవీలో అడవి శేష్ ఫోటోలు వైరల్ గా మారాయి.

సొంతం సినిమాలో నటించేటప్పుడు అడవి శేష్ వయస్సు 15 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఎన్నో మూవీస్ లో గుర్తింపు లేని పాత్రల లో అడవి శేష్ నటించాడు.ప్రస్తుతం అడవి శేష్‌ హిట్ మూవీ సీక్వెల్ ఐనా హిట్‌ : సెకండ్‌ కేస్‌లో హీరో పాత్రలో నటిస్తున్నారు. 2002 లో ఏటువంటి ప్రాధాన్యత లేని పాత్రల నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం తనకంటూ బ్రాండ్ సృష్టించిన అడవి శేష్ జీవితం సినీ కెరియర్లో తమ ప్రతిభను రాబట్టుకోవాలి అనుకునే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -