FIFA World Cup 2022: బ్రెజిల్ అభిమానుల ఆనందానికి కారణం అయిన టైం ట్రావెలర్!

FIFA World Cup 2022: టైం ట్రావెల్ అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఒక ప్రముఖ రచయిత రాసిన నవల వల్ల ఈ అంశం బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ జనాలు ఈ అంశం గురుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కొంత మంది టైం ట్రావెల్ సాధ్యం అంటారు. మరికొంత మంది ఇది జరిగే పని కాదు అంటారు.

సినిమాలు కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. ఇటీవల మంచి విజయం సాధించిన బింబిసార చిత్రం కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్. ఆ కాలం రాజు బింబిసారుడు మన ప్రస్తుత కాలంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ.అయితే టైం ట్రావెల్ సాధ్యపడే విషయం అని చెప్పడానికి అప్పుడప్పుడూ కొంత మంది కొన్ని విషయాలను చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి అద్బుతం గురించే మాట్లాడుతూ ఉన్నారు.

ఈ జట్టే విజేత?

తనని తాను టైం ట్రావెలర్ గా చెప్పుకునే ఒక వ్యక్తి టిక్ టాక్ లో ఒక టీవీ ఫుటేజ్ ని షేర్ చేశాడు. అందులో బ్రెజిల్ ఇంకా ఫ్రాన్స్ ఫైనల్ లో తలపడగా బ్రెజిల్ జట్టు విజయం సాధిస్తుంది. అతని టిక్ టాక్ అకౌంట్ పేరు కూడా @worldcuptimetraveller.

జనాలు ఊరికే అతని మాటలు విశ్వసించడం లేదు. గతంలో కూడా అతను చెప్పింది చెప్పినట్టు జరిగింది. 2020 యూరో కప్ లో ఇటలీ చేతిలో ఇంగ్లాండ్ పరాజయం పలవుతుంది అని అతను చెప్పాడు. నిజంగానే అది జరిగింది. దీంతో బ్రెజిల్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. గెలిచేది తమ జట్టు అంటూ వాళ్ళు సంబరాల్లో మునిగి పోయారు. చూడాలి మరి ఈ టైం ట్రావెలర్ చెప్పేది ఈ సారి కూడా నిజం అవుతుందో లేదో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -