Radhika Apte: బీర్ తాగుతున్న బాలయ్య హీరోయిన్.. దబిడి దిబిడే!

Radhika Apte: టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన హీరో నందమూరి బాలయ్య. ఆయన సినిమాలో హీరోయిన్ గా చేసిన వాళ్లకు చాలాకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను ఒడిసిపట్టుకొని ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే.

బాలీవుడ్ లో సినిమాలతో పాటు వివాదాలతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ గా రాధికా ఆప్టేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ మధ్యన అర్ధనగ్నంగా దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి వివాదాస్పదమైంది. అయితే ఆ విషయంలో అమ్మడు మీద కేసు నమోదు కావడం, పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది.

రాధికా ఆప్టే తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో మీద ఇప్పుడు వివాదం మొదలైంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ.. బీర్ తాగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అమ్మడు మరోసారి వివాదానికి తెర తీసింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం సినిమాల్లో వస్తుంటే.. ఆ సినిమాల్లో నటించే ఈ భామ మాత్రం రియల్ లైఫ్ లో మద్యపానం తాగాలన్నట్లు పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సినీ తారలు ఇలా మద్యంతో ఉన్న ఫోటోలను చూసి జనాలు ఏం నేర్చుకోవాలని మరికొందరు కామెంట్ చేశారు. అయితే మామూలుగా అయితే నెటిజన్లు తన గురించి ఏమైనా కామెంట్ చేస్తే ఘాటుగా స్పందించే రాధికా ఆప్టే.. ఈ ఫోటో మీద ఎన్ని కామెంట్లు వచ్చినా వాటి గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -