Dilraju-Balayya: ఆ ఒక్క మాటతో దిల్ రాజు పరువు తీసిన బాలయ్య.. కానీ?

Dilraju-Balayya: సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు షూటింగ్ లు జరుగుతున్న సమయంలో అక్కడున్న వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ పంచులు వేస్తూ ఉంటారు. తెలుగులో అయితే మహేష్ బాబు, బాలకృష్ణ రవితేజ లాంటి హీరోలు షూటింగ్ సెట్లో పంచులు వేస్తూ అక్కడున్న వారిని బకరా చేస్తూ ఉంటారు. అలా పంచులు వేస్తూ తాజాగా హీరో బాలకృష్ణ నిర్మాత దిల్ రాజుని ఒక ఆట ఆడుకున్నారు. అసలేం జరిగిందంటే..

తాజాగా ఓ సినిమా షూటింగ్ సెట్ లో భాగంగా హీరో బాలకృష్ణ అక్కడున్న వారిపై వరుసగా పంచులు పేల్చారు. పావుగంట పాటు అక్కడున్న వారందరిని ఒక ఆట ఆడుకున్నాడు బాలకృష్ణ.

ఒక సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు హాజరయ్యారు. వారిలో దిల్ రాజు కూడా ఒకరు. అప్పుడు బాలయ్య అందరి మీద పంచులు వేస్తూ ఆ తర్వాత నిర్మల దిల్ రాజ్ ని టార్గెట్ చేశాడు. నిన్ను దిల్ రాజు అని ఎందుకు అంటారు.. నువ్వు రాజు కాదు కదా అని ప్రశ్నించారు బాలకృష్ణ. అప్పుడు దిల్ రాజు ఆ విషయంపై స్పందిస్తూ.. మామూలుగా అందరూ తనని రాజు అని పిలుస్తారని, దిల్ సినిమాతో దిల్ రాజుగా మారానని తెలిపాడు. అప్పుడు బాలకృష్ణ అంతటితో ఆగకుండా మళ్ళీ కౌంటర్ వేస్తూ నీకు దిల్ కూడా లేదుగా అని చటుక్కున అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

ఈ మధ్యకాలంలో దిల్ రాజు ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా దిల్ రాజు పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. మొన్నటికి మొన్న కార్తికేయ 2 సినిమా విషయంలో ఒక కాంట్రవర్సీలో చిక్కుకున్న దిల్ రాజు ఆ తర్వాత ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడంతో మరొక వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -