Nagarjuna: నాగార్జున ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున దాదాపు 100కుపైగా సినిమాల్లో నటించారు. ఇందులో ఎక్కువగా తెలుగు సినిమాలే చేశారు. కొన్ని తమిళం, హిందీ సినిమాలు ఉన్నాయి. ‘విక్రం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘గీతాంజలి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నటుడిగా నాగార్జున మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం ‘శివ’ పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోల సరసన నాగార్జునను నిలబెట్టింది. ఆ తర్వాత నాగార్జున వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘హలో బ్రదర్, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, శ్రీరామదాసు, బంగార్రాజు’ వంటి సినిమాలు నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. లేటెస్ట్ గా నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది.

 

 

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిగ్‌బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిత్ కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. సాధారణంగా ఎవరికైనా ఒక ఫేవరేట్ యాక్టర్ ఉంటారు. స్టార్ హీరోలు కూడా వేరే హీరోకి అభిమానులుగా ఉంటారు. ఇంట్లోనే ఎంతోమంది స్టార్లు ఉన్న నాగార్జున కూడా ఓ యాక్టర్‌కు వీరాభిమాని. అంతను ఎవరంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నాగార్జున తన ఫేవరేట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కైండ్ హార్టెడ్ పర్సన్ అని, సినిమాలతోపాటు నిజజీవితంలోనూ రియల్ హీరోగా ఉంటాడని పేర్కొన్నారు. అయితే నాగార్జున.. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చెప్పుకోవడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతున్నారు. ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్ మరొక్కరి ఉండదని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -