Ram Gopal Varma: ఏంటీ? ఆర్ఆర్ఆర్ కంటే కార్తికేయ 2 పెద్ద హిట్టా.. అర్జీవి వైరల్ కామెంట్స్!

Ram Gopal Varma: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే స్పందిచగా తాజాగా ఈ సినిమా పై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. కార్తికేయ 2 సినిమా కలెక్షన్లను చూస్తుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కంటే కార్తికేయ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉంది అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేస్తూ..బాలీవుడ్‌ స్టార్‌హీరోలు ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా రక్షాబంధన్ సినిమా కంటే నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా డబుల్‌ కలెక్షన్లు సాధించింది అని తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన దాన్ని బట్టి చూస్తే.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అలాగే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన కేజీయఫ్ ‌2 సినిమా కంటే కార్తికేయ 2 బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.

ఇక దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నా అభినందనలు అని తెలిపారు. ఇకపోతే కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ అనుపమ జంటగా నటించారు. అలాగే ఇందులో అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేనన్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -