RRR: ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ కథ అలా ఉండబోతుందా?

RRR: ప్రపంచవ్యాప్తంగా బహుబలి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ సింగర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే హీరోయిన్లుగా ఒలీవియా మోరిన్, ఆలియాభట్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.613.06 కోట్లు షేర్, రూ.1150.10 కోట్ల గ్రాస్ రాబట్టింది.

 

థియేటర్లతోపాటు ఓటీటీలోని సంచలనం సృష్టించింది. జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. అలాగే అరుదైన రికార్డులను కూడా బ్రేక్ చేసింది. కాగా, ఇటీవలే ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ మూవీకి జపాన్‌లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేంజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూఎస్‌లోని చికాగోలో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడి మీడియాతో పలకరింపులు జరిపిన డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

 

ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ ఉండబోతుందా? అనే ప్రశ్నకు రాజమౌళి బదులిచ్చాడు. ‘ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పకూడదు. సినిమా స్టోరీలకు సంబంధించిన పనులు మా నాన్న గారు చూసుకుంటారు. మా మధ్య అప్పట్లోనే ఆర్ఆర్ఆర్ పార్ట్-2పై చర్చ వచ్చింది.దానిపై మా నాన్న, టీమ్ పని చేస్తున్నారు.’ అని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన స్టోరీ లైన్‌పై ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌లో ఇద్దరు హీరోలు తమ తమ ప్రాంతాల కోసం వేరు వేరుగా పోరాటం చేయడాన్ని చూపించబోతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉండబోతుందన్న విషయం తెలిసి ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -