Charan-Upasana: చరణ్, ఉపాసన వారసుడి పేరు ఫిక్స్.. ఏం పేరు అంటే?

Charan-Upasana: మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన గర్భవతి అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వార్త వచ్చినప్పటి నుంచి రామ్ చరణ్, ఉపాసనలకు చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉపాసన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లి అయ్యి పదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటికీ వారు తల్లిదండ్రులు అవుతున్నట్టు ప్రకటించలేదు. ఇప్పుడు గుడ్ న్యూస్ తెలియడంతో రామ్ చరణ్, ఉపాసనలకు ఇతర ఇండస్ట్రీల్లోని సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

రామ్ చరణ్, ఉపాసనలకు కొడుకో కూతురో పుడితే ఏ పేరు పెట్టాలనేది ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం. చరణ్, ఉపాసనలకు కుమారుడు పుడితే అంజన్ తేజ్ అని పేరు పెట్టాలనుకున్నట్లు సమాచారం. ఒక వేళ వీరికి కూతురు పుడితే అంజనీ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవివే ఈ పేర్లను ఖరారు చేసినట్లు బోగట్టా. ఈ పేర్లు తమకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్, ఉపాసనలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

 

ఆంజనేయ స్వామి భక్తుడు అయిన చిరంజీవి ఆ దేవుని పేరుపైనే తన మనవడు, మనవరాలి పేరు పెట్టాలనుకున్నారట. అందుకే రామ్ చరణ్, ఉపాసన పిల్లలకు ఈ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ పేర్లను మెగా ఫ్యామిలీ మాత్రం ఇంతవరకూ అధికారికంగా చెప్పలేదు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

 

మామూలుగా అయితే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ పేర్ల చివరన తేజ్ అనే పేరు ఉంటుంది. అందుకే తన మనవడికి అంజన్ తేజ్ అని పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పెట్టిన ఈ పేర్లు చాలా బావున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత ఈసారి అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన బిగ్ అప్ డేట్లు వెల్లడి కానున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -