Kasthuri: ఆ నటి సంపాదనను ఏం చేస్తోందో తెలుసా? నెటిజన్ ప్రశ్నకు ఏం చెప్పిందంటే

Kasthuri: సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి తగినట్లుగా సెలబ్రిటీలు కూడా తమ హోమ్ టూర్లు వంటివి చేస్తూ ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ పర్సనల్ లైఫ్ ని పెట్టేస్తూ ఉంటారు. వాటిని చూసి కొందరు నిజం అని నమ్మితే మరికొంత మంది వ్యూస్ కోసం అలా చెబుతున్నారని అనుకుంటూ ఉంటారు. సంపాద విషయంలో చాలా మంది నిజనిజాలు చెప్పరు. అయితే కొందరు మాత్రం తమ అసలైన సంపాదన గురించి కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు.

 

సినీ నటులే కాదు సీరియల్స్ నటులు కూడా అలానే కొందరు ఉన్నారు. తెలుగు సీరియల్స్ లో ‘గృహలక్ష్మి’ ద్వారా కస్తూరి ఎక్కువ మార్కులు పొందింది. ఆ సీరియల్ లో తులసి క్యారెక్టర్ లో కస్తూరి జీవించేసింది. దీంతో చాలా మంది కస్తూరికి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ కస్తూరి గతంలో అన్నమయ్య సినిమాలో నాగార్జున సరసన నటించింది. అంతేకాదు ఈ మధ్యనే వచ్చిన పరంపర అనే వెబ్ సీరిస్ లో కూడా బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది.

 

కస్తూరిని ఎవరైనా చూస్తే ఆవె రిచ్ అని అంటారు. అయితే ఆమె చెన్నై మెట్రోలో ప్రయాణిస్తూ తన ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో అధికారులు ఆ ఫోనును స్వయంగా అందించారు కూడా. దీంతో ఆమె మెట్రో అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఆమె మెట్రో అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు చేసింది. దీంతో ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. సొంతంగా కారుండి ఇలా మెట్రోలో వెళ్లడం ఎందుకని అతడు ప్రశ్నించాడు. అందుకు కస్తూరి బదులిచ్చింది.

 

తనది ఓ సాధారణ జీవితం అని కస్తూరి చెప్పుకొచ్చింది. తనకు సొంత కారు కానీ, ఇంట్లో ఏసీగానీ, టీవీలు గానీ లేవని తెలిపింది. అయితే సాధించిన డబ్బులంతా ఏం చేస్తున్నావ్ అని మరో ప్రశ్న వేశాడు. దానికి కస్తూరి బదులిస్తూ తాను సంపాదించినదంతా మెడికల్ హెల్ప్, చైల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో కస్తూరి చేస్తున్న సేవకు ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -