Tirumala Secrets: ఎవరికీ తెలియని రహస్యం.. తిరుమల స్వామివారి పట్టు వస్త్రాన్ని ఆ భక్తురాలు ఎందుకు చింపింది?

Tirumala Secrets: అప్పట్లో తిరుమల అర్చకులకు వెంగమాంబ అంటే పడేది కాదు.. ఒక రోజు స్వామివారు వెంగమాంబ దగ్గరికి వెళ్లారు. గుడి తెరిస్తే అక్కడ స్వామివారు ఉండాలి, కానీ ఇక్కడ వెంగమాంబ స్వామివారిని వదలడం లేదు.. స్వామి వారు వెళ్తూ ఉండగా స్వామివారి పట్టు వస్త్రాన్ని గట్టిగా పట్టుకుని లాగింది వెంగమాంబ. అసలు ఏం జరిగింది. తిరుమల శ్రీవారిని వెంగమాంబ ఎందుకు వదలలేదు? మీకోసం..

 

సాక్షాత్తు స్వామివారే వెంగమాంబ దగ్గర..
సాక్షాత్తు తిరుమల శ్రీవారు వెంగమాంబ దగ్గరికి వెళ్లి సేదతీరేవారు. అయితే ఈ విషయం ఎవరూ నమ్మేవారు కాదు. పోగా.. అందరూ వెంగమాంబను శంకించేవారు. ఇక ఈ విషయం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెంగమాంబ సాధారణంగానే ఉండేది. పూజలు ముగిసాక ప్రతి రోజు స్వామివారు వెంగమాంబ దగ్గరికి వెళ్లేవారంట. ఒక రోజు స్వామివారు ఆలస్యంగా వచ్చాడట. అప్పుడు స్వామివారికి సేవలు చేస్తూ ఆ మహా భక్తురాలు వెంగమాంబ.. స్వామిని ఒక కోరిక కోరతాను.. తీరుస్తారా? అడగగా.. స్వామివారు సరేనన్నారట.

 

స్వామీ మీరు రాత్రి రావడం, సుప్రభాత సమయంలో మళ్ళీ వెళ్లిపోవడం నేను సహించలేకపోతున్నాను. మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండేలా వరం ఇవ్వండీ అని కోరింది. దీనితో ఆలోచనలో పడ్డ స్వామి.. వెంగమాంబ నేను ని దగ్గరే ఉంటే మరి ప్రపంచంలో ఉన్న మిగతా భక్తుల పరిస్థితి ఏంటి? అందుకే అది ఎలా కుదురుతుంది నువ్వే ఆలోచించు అని తప్పించుకోబోయాడట. దీనితో వెంగమాంబ స్వామివారి పట్టు వస్టర్ని గట్టిగా పట్టుకోగా.. అది కొంచెం చిరిగి పోయి అక్కడే ఉండిపోయింది.

 

పొద్దున్నే సుప్రభాత సేవ ప్రారంభించిన అర్చకులు స్వామివారి వస్త్రం చిరిగిపోయి ఉండడాన్ని గమనించి ఎవరైనా దొంగిలించారేమోనని వెతకడం ప్రారంభించారు. చివరికి వెంగమాంబ వద్ద స్వామివారి వస్త్రం దొరుకుతుంది. కానీ అది ముక్కగా కాకుండా పూర్తి వస్త్రం ఉంటుంది. దీనితో అర్చకులు వెళ్లి స్వామివారిని చూడగా స్వామివారు వస్త్రం లేకుండా ఉంటారు. దీనితో జరిగిన విషయం అందరికీ అర్ధమై, స్వామి వారు రోజు వెంగమాంబ వద్దకు వస్తారనే విషయం తేటతెల్లమైంది. ఆ వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి.. ఎంతో మంది నోచుకోని అదృష్టం నీకు కలిగిందని వెంగమాంబను చూసి అందరు మురిసిపోయారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -