Tirumala: తిరుమల కొండపై తీర్థాల్లో దేవతా రహస్యాలు.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tirumala: కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం ఎంతోమంది భక్తులు ప్రతిరోజు స్వామి వారి ఆలయానికి తరలి వెళ్తూ ఉంటారు.ఇలా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజూ స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకుంటారు.ఇక ఈ తిరుమల కొండపై ఎన్నో విశేషాలు ఉన్నాయి. అలాగే తిరుమలలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట కూడా సాక్షాత్తు స్వామి వారి స్వరూపమే అని భావిస్తూ ఉంటారు.

తిరుమల కొండపై స్వామివారి ప్రధానాలయానికి దగ్గర ఉండే స్వామి పుష్కరిణి చాలా పవిత్రమైనది. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పుష్కరిణిలో స్నానం చేశారని అందుకే స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో ఈ పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని భావిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగ తీర్థం ఉంది. ఇక్కడ స్నానం ఆచరిస్తే 100 జన్మల పాపం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

 

ఆలయానికి మూడు మైళ్ళ దూరంలో పాప వినాశనము ఉంది. ఇక్కడ స్నానం చేస్తే, సకల పాపాలు పోతాయి. ఇదే దారిలోనే జాబాలి తీర్థం ఉంది. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేస్తే, ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని చెప్తారు. ఆలయానికి 16 కిలోమీటర్ల దూరంలో, తుంగర తీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి.

 

ఇక్కడే ఉన్నటువంటి పాండవ తీర్థంలో స్నానం ఆచరిస్తే కష్టాలు తొలగిపోతాయి అలాగే తిరుమల కొండపై ఉన్నటువంటి కుమారధార తీర్థం, చక్రతీర్థం, నాగ తీర్థం, శేష తీర్థం కూడా ఉన్నాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు, వీటిని సందర్శించి ఇక్కడ స్నానాలు ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -