Tirumala: భరతనాట్యం చేస్తూ 75 నిమిషాల్లో తిరుపతి మెట్లెక్కిన కళాకారుడు.. ఏం జరిగిందంటే?

Tirumala: కలియుగ దైవమైనటువంటి తిరుమల శ్రీవారి దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకుంటారు. అయితే చాలామంది స్వామివారి మొక్కు నిమిత్తం మెట్ల మార్గం గుండా పయనిస్తూ ఉంటారు. ఇలా మెట్ల మార్గం గుండా వెళ్లేవారు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటే వెళ్లడమే కాకుండా మరికొందరు దీపాలు వెలిగిస్తూ వెళ్తూ ఉంటారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు.

అలాంటిది చాలామంది ప్రతి మెట్టుకి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్లడం దీపాలు వెలిగించుకుంటూ వెళ్లడం చేస్తుండడం చూస్తే వారికి స్వామి వారిపై ఎంతో నమ్మకం ఉందని చెప్పాలి. ఇకపోతే సాధారణంగా నడిచేవారు కూడా ఈ మెట్లు ఎక్కడానికి కొన్ని గంటల సమయం పడుతుంది అయితే ఓ నాట్య కళాకారుడు మాత్రం విభిన్న రీతిలో తిరుమల మెట్లు ఎక్కుతూ కొండకు చేరుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

భరతనాట్యం వేదికపై చేయాలి అంటే ఎంతో కష్టతరంగా ఉంటుంది అలాంటిది ఒక కళాకారుడు ఏకంగా తిరుమల మెట్ల మార్గం గుండా భరతనాట్యం చేస్తూ మెట్ల అన్ని ఎక్కి కొండపైకి చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా ఈ కళాకారుడు ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లారు. ఈ విధంగా తన నాట్య ప్రదర్శనను చూపిస్తూనే మెట్లు ఎక్కడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ఈ వ్యక్తి మెట్లపై భరతనాట్యం చేసుకుంటూ కేవలం 75 నిమిషాలలోనే తిరుమల కొండ చేరుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -