Tirumala: లక్షితను బలిగొన్న చిరుత ఇంకా తిరుమల కొండల్లో ఉందా.. అధికారులు చేస్తున్న తప్పు ఇదేనా?

Tirumala:  తిరుమల కాలిబాటలో భాగంగా ఒక చిరుత లక్షిత అనే చిన్నారిని బలి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ చిన్నారి చిరుత దాడిలో మరణించిన తర్వాత ఒక్కసారిగా అప్రమత్త మైనటువంటి అటవీ శాఖ అధికారులు టిటిడి అధికారులు అలిపిరి మార్గంలో బోన్లు ఏర్పాటు చేశారు. ఈ బోన్ల ద్వారా నాలుగు చిరుతలను పట్టుకొని వాటిని టెస్టింగ్ కి పంపించగా ఇందులో రెండు చిరుతలు మనుషులను తినే చిరుతలు కాదు అని తేలింది.

మరో చిరుతకు దంతాలు లేవు తద్వారా ఈ చిరుత మనుషుల్ని తినే అవకాశం ఏమాత్రం లేదని అధికారులు తెలియజేశారు. మరొకటి కేవలం 15 రోజుల పసికూన కావడంతో ఇది కూడా మనుషులను చంపే అవకాశం లేదని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరి బోనులో దొరికినటువంటి ఈ నాలుగు చిరుతలు లక్షితను చంపినవి కాకపోతే మరి ఆ చిరుత ఎక్కడ ఉందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.

ఇలా మనిషి రక్తానికి మనిషి మాంసానికి అలవాటు పడినటువంటి ఆ చిరుత అటవీ ప్రాంతంలోని తిరుగుతుందని మరోసారి అది భక్తులపై దాడి చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. అలిపిరి కాలి బాటలో ఒక బాలుడిపై దాడి చేసినటువంటి చిరుత బోను సహాయంతో అధికారులు దానిని బంధించి కొద్ది రోజులపాటు జూ పార్క్ లో ఉంచి అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా అడవిలో వదిలేశారు. ఈ ఘటన జరిగిన నెల రోజులకే లక్షిత ఘటన కూడా జరిగింది.

ఈ ఘటనలో పాల్గొన్నటువంటి చిరుత అదే ఉంటుందని అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒకసారి క్రూర మృగాలు మనిషి రక్తం రుచి మరిగితే తిరిగి మనుషులపై దాడి చేస్తాయని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పటివరకు బంధించిన నాలుగు చిరుతలలో ఆ బాలికను చంపిన చిరుత లేకపోవడంతో ఆ చిరుత ఎక్కడ ఉందని, ఆ చిరుత మరోసారి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశాలు ఉన్నాయా అని అధికారులు అప్రమత్తమై మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -