Lunar Eclipses in Tirumala: చంద్ర గ్రహణం రోజున శ్రీవారి ఆలయం మూసివేత.. ఆ సదుపాయాలను రద్దు చేశామంటూ?

Lunar Eclipses in Tirumala: కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అయితే అక్టోబర్ 28వ తేదీ స్వామివారి ఆలయం ఏకంగా ఎనిమిది గంటల పాటు మూసి వేయబడుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే భక్తులకు సమాచారం అందించారు.

అక్టోబర్ 28వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో కూడా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది అందుకే ముందుగానే ఆలయాలన్నీ కూడా మూసి వేయనున్నట్లు తెలియజేశారు ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం ఏడు గంటలకు మూసివేసి ఉదయం 3:25 నిమిషాలకు సుప్రభాత సేవలో స్వామి వారి ఆలయ తలుపులు తెరవనున్నట్లు టిటిడి వెల్లడించింది. ఈనెల 29 వ తేదీ రాత్రి 1.05 నుంచి 2.25 పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ విధంగా చంద్రగ్రహణం ఏర్పడటంతో గ్రహణానికి 6 గంటల ముందు అనగా 28వ తేదీ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఇలా స్వామివారి ఆలయాన్ని మూసివేయడంతో 28వ తేదీ సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ, వికలాంగులకు వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శనాన్ని నిలిపివేయునున్నట్లు ముందుగానే టీటీడీ అధికారులు ప్రకటించారు భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ముందుగానే అన్ని విషయాలను ప్రకటించినట్లు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -