MeToo: సె* కు నో చెప్పిన నటీమణులకు అలాంటి పరిస్థితా?

MeToo: ఈ మధ్యకాలంలో హీరో, హీరోయిన్లు తమకు జరిగే అవమానాలపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. తాజాగా ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ నటుడు జానీ డెప్ అతడి మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య కోర్టు కేసు నడుస్తోంది. పరువు నష్టం కేసుల్లో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరువు తీసిన భార్యపై నెగ్గి జానీ డెప్ విజయాన్ని అందరితో పంచుకున్నాడు. జానీ డెప్ కు ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

2022వ ఏడాది మొదట్లోనే డెప్ తన మాజీ భార్య హియర్డ్ పై పరువు నష్టం కేసు వేసి గెలిచారు. జ్యూరీ అతనికి 15 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు వేయగా చాలా చర్చల తర్వాత ఆ కేసు పరిష్కారమైంది. అంబర్ హర్డ్ సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరిచింది. అమెరికన్ న్యాయ వ్యవస్థపై తాను నమ్మకం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను లైంగిక హింసకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిపింది. సమాజంలో ఉన్న సంస్కృతి మారాలని, రెండు సంవత్సరాల క్రితం తాను గృహహింసకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని అయ్యానని విమర్శించింది.

 

తాను చాలా చిన్న వయస్సులోనే ఇతరుల దుర్వినియోగానికి బలైనట్లు తెలిపింది. శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా పురుషులకు శక్తి ఉందని చాలా సంస్థలు వారికి మద్దతు ఇస్తాయని, అయితే మహిళలకు అలాంటి ఆదరణ లేదని తెలిపింది. తాను కాలేజీలో లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. తన స్నేహితులు తనని చాలా బాదపెట్టారని, తనకు నటిగా అవకాశాలు ఇవ్వరని వారు పెట్టినట్లు తెలిపింది. నిజంగానే వారు అన్నట్లుగా తాను సినిమా అవకాశాలు కోల్పోయినట్లు తెలిపింది. దుర్వినియోగానికి గురైన వ్యక్తులను సంస్థలు ఎలా కాపాడతాయో తనకు తెలిసిందని అంబర్ వెల్లడించింది.

 

ఈ మధ్యకాలంలో #MeToo ఉద్యమం హాలీవుడ్ లోనే కాకుండా అన్ని చోట్లా వినిపిస్తోందని, జీవితంలోని ప్రతి నడకలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక శక్తితో దూసుకుపోతున్న ఈ పురుషులను మహిళలు ఎదుర్కొంటున్నట్లు అంబర్ తెలిపింది. తనను తొలగించిన కంపెనీలపైనా అంబర్ తీవ్రంగా విరుచుకుపడటంతో సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -