Pawan kalyan: రీమేక్ సినిమాలపై కామెంట్లు చేసేవాళ్లకు పవన్ జవాబిదే!

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలు కైండ్ హార్టెడ్ పర్సన్. తమ అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చిందని తెలిసినా.. వారిని ఆదుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వీరిద్దరూ కొన్ని వారాల వ్యవధిలోనే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో సందడి చేయనున్నారు. అయితే వీరిద్దరూ విడివిడిగా.. వేరే వేరే ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. ప్రభాస్-గోపీచంద్‌తో కలిసి షోకి రానుండగా.. పవన్ కళ్యాణ్- డైరెక్టర్ క్రిష్ షోలో సందడి చేయనున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ షోకి రానుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

 

 

అయితే బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. మెగా-నందమూరి హీరోల కాంబినేషన్‌లో టాక్ షో జరగడం ఈ ఎపిసోడ్‌కు మరింత స్పెషల్‌గా మారనుంది. బాలయ్య ఎలాంటి కొషన్స్ వేస్తారు? వాటికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా జవాబిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటిది టాక్‌ షోకి వస్తాడని తెలియడంతో ప్రేక్షకులు కూడా ఎక్సైట్‌మెంట్‌కు లోనవుతున్నారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఆహా యూనిట్ విడుదల చేయనుంది.

 

 

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువగా రిమేక్ సినిమాలు చేశారు. దాంతో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. నెటిజన్లు కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘తెరి’ రీమేక్‌ విషయంలోనూ అదే అసంతృప్తి కొనసాగుతోంది. ఈ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ షోపై స్పందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రీమేక్ సినిమాల విషయంపై ఘాటుగానే జవాబు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, మరోవైపు బాలయ్య.. పవన్ కళ్యాణ్‌కు అడగాల్సిన ప్రశ్నలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -