NBK-PSPK: బాలయ్య షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్..ఈ కలయిక ఆ షో కోసమేనా?

NBK-PSPK: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నవారి లిస్టులో నందమూరి బాలయ్య కూడా ఉన్నారు. బాలయ్య ఓ వైపు సినిమా చేస్తూ మరో వైపు రాజకీయాలలో ఫుల్ బిజీ ఉండటమే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రస్తుతం సాంగ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరుపుకోవడంతో పాటు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోనుంది.

వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా చేస్తోంది. ఇక బాలయ్య ఈ సినిమాలతో పాటుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఈ టాక్ షోకు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ బాలయ్య నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర సెట్స్‌లో వెళ్లారట. అలా షూటింగ్ స్పాట్ కు వెళ్లి బాలయ్యకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న వీరసింహారెడ్డి సెట్స్‌లో పవన్ కొద్దిసేపు బాలయ్యతో పాటు సందడి చేశాడట.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే బాలయ్యతో అన్‌స్టాపబుల్-2 స్టేజీని పంచుకునేందుకు పవన్ రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఇలా బాలయ్యను కలవడంతో అందరికీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు బాలయ్యతో పవన్ కల్యాణ్ టాక్ షోలో పాల్గొనే ఎపిసోడ్ షూటింగ్‌ను డిసెంబర్ 27వ తేదిన నిర్వహించేందుకు ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక పవన్ తన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చేశాడు. ఈ ఇద్దరి కోసం అన్ స్టాపబుల్ స్టేజ్ ఎదురుచూస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -